Thursday, January 23, 2020

Politics

ఏపీ చరిత్రలో ఇది బ్లాక్‌ డే

ఏపీ వికేంద్రీకరణ బిల్లును సెలక్ట్‌ కమిటీకి పంపడం దుర్మార్గం చంద్రబాబు గ్యాలరీలో కూర్చుని మండలి చైర్మన్‌ను ప్రభావితం చేశారు 90 శాతం మెజారిటీతో శాసనసభ ఆమోదం తెలిపిన బిల్లును ఉద్దేశ పూర్వకంగా అడ్డుకున్నారు ఆర్థిక, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ మండిపాటు

Crime

ప్రముఖ వ్యాపారి భార్య అనుమానాస్పద మృతి కలకలం

న్యూఢిల్లీ: ప్రముఖ సైకిల్ తయారీదారు అట్లాస్ సైకిల్స్ అధినేత సంజయ్‌ కపూర్‌ భార్య నటాష్ కపూర్ (57) అనుమానాస్పద మరణం కలకలం రేపింది. మంగళవారం మధ్యాహ్నం సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని చనిపోయినట్టు గుర్తించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. జీవితం మీద విరక్తితో ఆత్మహత్యకు పాల్పడినట్టు ప్రాథమికంగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆర్థిక సంక్షోభం కూడా ఆత్మహత్యకు కారణమని అధికారులు భావిస్తున్నారు. ఢిల్లీ ఔరంగజేబు మార్గంలోని తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని చనిపోయినట్టుగా బుదవారం తమకు సమాచారం […]

అట్లాస్ సైకిల్స్ ఓనర్ భార్య ఆత్మహత్య.. పోలీసుల అనుమానాలు

అట్లాస్ సైకిల్స్ సంస్థ యజమాని సంజయ్ కపూర్ భార్య నటాష్ కపూర్ (57) ఆత్మహత్య చేసుకున్నారు. ఢిల్లీలోని ఔరంగజేబు మార్గంలోని తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని చనిపోయారు. ఆమె సూసైడ్ చేసుకున్నట్లు బుధవారం పోలీసులకు సమాచారం అందింది. ప్రాథమిక ఆధారాల ప్రకారంగా ఆమె సూసైడ్ చేసుకున్నట్లు భావిస్తున్నామని చెప్పిన పోలీసులు.. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని గంగారామ్ ఆస్పత్రికి తరలించారు. మధ్యాహ్నం లంచ్ తినేందుకు ఇంట్లో అందరూ […]

Sports

సర్ఫ్‌రాజ్‌ ట్రిపుల్‌

ముంబై: రంజీల్లో ముంబై యువ బ్యాట్స్‌మన్‌ సర్ఫ్‌రాజ్‌ ఖాన్‌ (391 బంతుల్లో 30 ఫోర్లు, 8 సిక్సర్లతో 301 నాటౌట్‌) ట్రిపుల్‌ సెంచరీతో అదరగొట్టాడు. యూపీతో మ్యాచ్‌లో 294 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద.. టీమిండియా ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ స్టైల్లో సిక్స్‌తో సర్ఫ్‌రాజ్‌ ట్రిపుల్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఈ క్రమంలో 2009లో రోహిత్‌ శర్మ తర్వాత ముంబై తరఫున త్రి శతకం బాదిన తొలి ఆటగాడిగా సర్ఫ్‌రాజ్‌ రికార్డులకెక్కాడు. 353/5తో ఆఖరి, నాలుగోరోజైన బుధవారం తొలి […]

ఖేలో ఇండియాలో శ్రావ్య-సాత్వికకు రజతం

గువాహటి: ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌ బుధవారం ముగిశాయి. చివరి రోజు పోటీల్లో బాలికల అండర్‌-21 టెన్నిస్‌ డబుల్స్‌ ఫైనల్లో తెలంగాణకు చెందిన శ్రావ్య శివాణి-సామ సాత్విక జోడీ 6-3, 3-6, 7-10తో స్నేహల్‌-మిహికా యాదవ్‌ (మహారాష్ట్ర) జంట చేతిలో ఓడి రజత పతకం దక్కించుకొంది. 7 పసిడితో సహా మొత్తం 21 పతకాలను సాధించిన తెలంగాణ.. 15వ స్థానంతో టోర్నీని ముగించింది. ఏపీ 22వ స్థానంలో నిలిచింది. మహారాష్ట్ర 256 మెడల్స్‌తో అగ్రస్థానంలో నిలవడంతో పాటు వరుసగా […]