Tuesday, October 22, 2019

Politics

హుజూర్ నగర్ చేజారే అవకాశాలే కనిస్తున్నాయా..?

పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత నియోజక వర్గంలో ఉప ఎన్నిక పూర్తయింది. ఈ ఉప ఎన్నికలో గెలవాలన్న పట్టుదలతో తెరాస, కాంగ్రెస్ లు హోరాహోరీగా తలపడ్డాయి. ఉత్తమ్ ఇలాఖాలో కాంగ్రెస్ ను ఓడించాలన్న బలమైన పట్టుదలతో అన్ని రకాల మార్గాలనూ అధికార పార్టీ సమర్థంగా వినియోగించుకుందనే చెప్పాలి! మొత్తానికి, పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 85 శాతం మంది ఈ నియోజక వర్గంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే, ఎన్నికలకు ముందు హుజూర్ నగర్ ఫలితం […]

Crime

మంత్రాలయం టీడీపీ ఇన్‌చార్జ్‌ పి.తిక్కారెడ్డి అరెస్ట్‌

కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ పి.తిక్కారెడ్డిని తెలంగాణ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. లిక్కర్‌ పరిశ్రమ కోసం రూ.12 కోట్ల విలువైన వరి ధాన్యం తీసుకొని డబ్బు చెల్లించకపోవటంతో బాధితుడు సైబరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో చీటింగ్‌ కేసు పెట్టినట్లు తెలిసింది.

స్మగ్లింగ్‌కు ‘రెడ్‌’ సిగ్నల్‌

అమరావతి: ఎర్ర చందనాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తే స్మగ్లింగ్‌ తగ్గుతోంది. ఎగుమతులకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వని కాలంలో మాత్రం అక్రమ రవాణా భారీగా పెరిగిపోతోంది. ఎర్ర చందనంతో తయారుచేసిన వస్తువుల్ని కలిగి ఉండటాన్ని చైనా, జపాన్‌ దేశాల్లో సంపన్నులు స్టేటస్‌ సింబల్‌గా, శుభప్రదంగా భావిస్తుంటారు. అందువల్ల ఎర్ర చందనం దుంగలకు ఆ దేశాల్లో డిమాండ్‌ ఎక్కువ.

Sports

రషీద్ ఖాన్‌కే పట్టం: అమ్ముడుపోని ఆటగాళ్లలో గేల్, మలింగ

హైదరాబాద్: ఇంగ్లండ్‌-వేల్స్‌ క్రికెట్‌ బోర్డు(ఈసీబీ) ప‍్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ద హండ్రెడ్‌ లీగ్‌ ప్లేయర్ డ్రాఫ్ట్‌లో ఆప్ఘనిస్థాన్ ఆల్ రౌండర్ రషీద్ ఖాన్, ఆండ్రీ రస్సెల్‌లు అగ్రస్థానంలో నిలిచారు. ఆదివారం ఆటగాళ్ల డ్రాఫ్ట్‌లు పూర్తి కాగా అందులో రషీద్‌ ఖాన్‌ను తొలి జాబితాలోనే మొదటి క్రికెటర్‌గా తీసుకున్నారు. టీ20ల్లో నెంబర్ వన్ బౌలర్‌గా కొనసాగుతున్న రషీద్ ఖాన్‌ను ట్రెంట్‌ రాకెట్స్‌ జట్టు ఎంపిక చేసింది. గత కొంతకాలంగా అంతర్జాతీయ క్రికెట్‌లో రషీద్ ఖాన్ అద్భుత ప్రదర్శన చేస్తోన్న […]

ఉమేశ్‌ బౌన్సర్‌కు ఎల్గర్‌ విలవిల

రాంచి: భారత్‌తో మూడో టెస్టులో దక్షిణాఫ్రికా కష్టాలు కొనసాగుతున్నాయి. తొలి ఇన్నింగ్స్‌లో 162 పరుగులకే కుప్పకూలిన ఆ జట్టు ఫాలో ఆన్‌లోనూ అదే తరహాలో ఆడుతోంది. తేనీటి విరామానికి 26/4తో నిలిచింది. మహ్మద్‌ షమి (3/7) చురకత్తుల్లాంటి బంతులు సంధిస్తున్నాడు. వాటిని ఆడలేక సఫారీలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరో ఎండ్‌లో ఉమేశ్‌ (1/18) సైతం కట్టుదిట్టంగా బంతులు వేస్తున్నాడు. వీరిద్దరూ ఒక క్రమపద్ధతిలో విరుచుకుపడటంతో పర్యాటక జట్టుకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ప్రస్తుతం డీన్‌ […]