అంపైర్‌ పోర్న్‌ స్టార్‌!

Sports

క్రైస్ట్‌చర్చ్‌: న్యూజిలాండ్‌కు చెందిన 51 ఏళ్ల గార్త్‌ స్టిరాట్‌ జెంటిల్మన్‌ గేమ్‌లో అంపైర్‌. ఇంగ్లండ్‌-న్యూజిలాండ్‌ మధ్య టీ20కి అతడు నాలుగో అంపైర్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. బంతి పోయినా, ఆకారం మారి ఆటకు పనికి రాకపోయినా మరో బంతి ఇస్తారు. ఆ బంతుల బాక్స్‌ను గ్రౌండ్‌లోకి తీసుకు రావడమే నాలుగో అంపైర్‌ విధి. అన్నట్టు ఈ నాలుగో అంపైర్‌ గతంలో పోర్న్‌ స్టార్‌ ! అతడి చిత్రాలు ఓ మ్యాగజైన్‌లోనూ ప్రచురితమయ్యాయి. అంతేకాదు..స్టీవ్‌ పార్నెల్‌ పేరిట నీలి చిత్రాల్లోనూ నటించాడు. ఈ విషయం బహిర్గతం కావడంతో పదేళ్ల కిందట అతడు న్యూజిలాండ్‌ ప్రొఫెషనల్‌ గోల్ఫర్స్‌ అసోసియేషన్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ పదవి పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత క్రికెట్‌ అంపైర్‌గా మారాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *