ఫుఝౌ (చైనా): భారత బ్యాడ్మింటన్ డబుల్స్ యువ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ షెట్టి చైనా ఓపెన్ క్వార్టర్స్‌కు దూసుకెళ్లగా.. సింగిల్స్‌లో సాయి ప్రణీత్, కశ్యప్ ఓటములతో ఇంటిముఖం పట్టారు. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ ప్రీ క్వార్టర్స్‌లో సాత్విక్-చిరాగ్ జంట 21-18, 21-23, 21-11తో జపాన్ ద్వయం హిరోయుకి ఎండో-యుటాకు షాకిచ్చింది. 66 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో సాత్విక్ జోడీ అద్భుతమై పోరాట స్ఫూర్తిని ప్రదర్శించింది. ఇక, పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో వరల్డ్ చాంపియన్‌షి్‌ప పతక విజేత సాయి ప్రణీత్ 20-22, 22-20, 16-21తో అంటాన్సెన్ (డెన్మార్క్) చేతిలో పోరాడి ఓడాడు. కశ్యప్ 13-21, 19-21తో విక్టర్ అక్సెల్సెన్ చేతిలో పరాజయం పాలయ్యాడు. మ్యాచ్ ఆరంభంలో అదరగొట్టినా ఆ తర్వాత అనూహ్యంగా వరుస తప్పిదాలు చేస్తూ ఓటమిని చవిచూశాడు. మిక్స్‌డ్‌లో అశ్విని-సాత్విక్ జోడీ కూడా రెండో రౌండ్లోనే పరాజయం పాలైంది. అశ్విని-సాత్విక్ ద్వయం 21-23, 16-21తో దక్షిణ కొరియా జంట సియో సెంగ్ జె-చె యుజెంగ్ చేతిలో ఓడింది. దీంతో పురుషుల డబుల్స్ మినహా మిగతా భారత షట్లర్లు అందరూ టోర్నీ నుంచి నిష్క్రమించారు.
