- బస కోసం అఫ్ఘాన్ ఫ్యాన్ ఇక్కట్లు
లఖ్‌నవ్: పొడవైన వ్యక్తి అందరిలో ప్రత్యేకంగా కనిపిస్తాడు. వినడానికి, చెప్పడానికి బాగానే ఉంటుంది. కానీ, అదే పొడవు అఫ్ఘానిస్థాన్ క్రికెట్ జట్టు వీరాభిమాని షేర్‌ఖాన్‌కు చిక్కులు తెచ్చింది. ప్రస్తుతం లఖ్‌నవ్‌లో వెస్టిండీ్‌సతో అఫ్ఘానిస్థాన్ జట్టు మూడేసి వన్డేలు, టీ20 సిరీ్సతోపాటు ఓ టెస్ట్ మ్యాచ్‌లో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లను వీక్షించేందుకు కాబూల్ నుంచి అఫ్ఘాన్ టీమ్ వీరాభిమాని షేర్‌ఖాన్ ఇక్కడకు విచ్చేశాడు. అతడు ఎనిమిది అడుగుల రెండంగుళాల పొడుగు ఉండడంతో బస చేసేందుకు స్థానికంగా హోటల్ రూమ్ దొరక్క షేర్‌ఖాన్ పరేషాన్ అయ్యాడు. కాలికి బలపం కట్టుకొని లఖ్‌నవ్ అంతా తిరిగినా ఒక్కచోటా అతడికి రూమ్ లభించలేదు. దాంతో ఫేర్ఖాన్ పోలీసులను ఆశ్రయించగా వారు అతడిని తమతో తీసుకుపోయి నాకా ఏరియాలోని ఓ హోటల్లో గది ఇప్పించారు.