మెగాస్టార్ ని కాదని మహేష్ తో..?

Entertainment

సూపర్ స్టార్ రజినీకాంత్, మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా దర్బార్. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి రానున్న ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయింది. ప్రొమోషన్స్ గ్రాండ్ గా మొదలుపెడుతున్న చిత్ర యూనిట్, ఇండియన్ సూపర్ స్టార్స్ తో మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేయించారు.దర్బార్ మోషన్ పోస్టర్ ని హిందీలో సల్మాన్, తమిళ్ లో కమల్ హాసన్, మలయాళంలో మోహన్ లాల్ విడుదల చేశారు.దర్బార్ తెలుగు మోషన్ పోస్టర్ ని మహేశ్ బాబు రిలీజ్ చేశాడు. సూపర్ స్టార్ నటించిన సినిమా మోషన్ పోస్టర్ ని మెగాస్టార్ రిలీజ్ చేస్తారని అంత అనుకున్నారు కానీ ఇప్పుడు ఆ ప్లేస్ లోకి మహేశ్ వచ్చి చేరాడు. దీన్ని పట్టుకోని మహేశ్ బాబు, చిరంజీవిని మించిపోయాడు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే మహేశ్ బాబుతో స్పైడర్ సినిమా చేశాడు కాబట్టి మురుగదాస్ కి మంచి రిలేషన్ ఉంది. అందుకే దర్బార్ మోషన్ పోస్టర్ అతనితో రిలీజ్ చేపిస్తుండొచ్చు, ఇందులో చిరంజీవిని ఇన్సల్ట్ చేసే ఉద్దేశం చిత్ర యూనిట్ కి కానీ మహేశ్ కి కానీ లేదని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *