హీరోయిన్ రాశిని మోసం చేసిన దర్శకుడు తేజ ?

Entertainment

బాల నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రాశి, 90 దశకంలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఒక తెలుగమ్మాయి టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ హోదాను సంపాదించడం ఇప్పుడు చాలా కష్టమైన విషయం. కానీ, అప్పట్లో నటి రాశి చేసి చూపించారు. ఇకపోతే రాశి తెలుగులో మాత్రమే కాకుండా తమిళం, కన్నడ, హిందీ భాషల్లో నటించడమే కాకుండా బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి, తమిళ హీరోలు విజయ్, అజిత్‌ల సరసన కూడా నటించారు.

 

ఇక టాలీవుడ్ విషయానికి వస్తే బాలకృష్ణ, వెంకటేష్, పవన్ కళ్యాణ్, శ్రీకాంత్, జగపతిబాబు, మహేష్ బాబు లాంటి హీరోలతో కలిసి పనిచేశారు. ఇదే కాకుండా కొన్ని ప్రత్యేక గీతాల్లోనూ రాశి తెరపై కనిపించారు.. అదీగాకుండా మిగిలిన హీరోయిన్లతో పోల్చుకుంటే సీనియర్ హీరోయిన్ గా రాశికి ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు ఉండేది. అందుకే ఈ నటి హోమ్లీ హీరోయిన్ గా ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరైంది. ఇకపోతే ఈ భామ పెళ్లి తరువాత మాత్రం సినిమాలకు దూరమై, రీసెంట్ గా సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చి అమ్మ పాత్రలు చేస్తోంది.

‘కళ్యాణ వైభోగమే’ సినిమాలో మాళవిక నాయర్ తల్లి పాత్రలో చక్కగా నటించింది. తాజాగా ఈ బ్యూటీ ఓ టీవీ షోలో పాల్గొని,. తన వ్యక్తిగత విషయాలతో పాటుగా, వృత్తిపరమైన విషయాలకు సంబంధించి కొన్ని సీక్రెట్స్ చెప్పింది. అవేంటంటే రంగస్దలం సినిమాలో రంగమ్మత్త క్యారెక్టర్ కోసం ముందుగా తననే సంప్రదించారని, కాని తాను కొన్ని కారణాల వల్ల ఒప్పుకోలేదని తెలిపింది. ఆతర్వాత దర్శకుడు తేజ తనను మోసం చేసిన విషయాన్ని బయటపెట్టింది.

జరిగిన అసలు విషయం ఏంటంటే ‘నిజం’ సినిమాలో ఆమెని చూసిన వారంతా షాక్ అయ్యారు. అసలు రాశియేనా ఇలాంటి రోల్ లో చేసిందంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఒక విధంగా ఈ సినిమా రాశి ఇమేజ్ ని డ్యామేజ్ చేసిందని తెలిపింది.. ‘నిజం’ సినిమా కధ విషయంలో దర్శకుడు తేజ తను మోసం చేశాడని, ఈ సినిమాలో తన క్యారెక్టర్ అధ్బుతంగా ఉంటుందని నమ్మించి, మోసం చేసి సినిమాకి కమిట్ చేయించారని రాశి చెప్పింది.

ఆ చెప్పడం కూడా ఎలాగంటే సినిమా మొత్తం గోపీచంద్, మీరు లవర్స్ అని, మీ చుట్టే కధ అంతా తిరుగుతుందని, మీ మధ్యలోకి విలన్ వస్తాడని.. తేజ పాజిటివ్ గా చెప్పుకొచ్చినట్లు వెల్లడించింది. చిత్ర షుటింగ్ పూర్తియ్యేవరకు ఈ సినిమాలో తన పాత్రలో నెగెటివ్ యాంగిల్ ఉంటుందనే విషయం చెప్పకుండా మోసం చేసి సినిమాలో నటింపజేశారని చెప్పుకొచ్చారు రాశి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *