రాశీఖన్నాకు ఇదే తొలిసారి. ఎగ్జయిట్ అవుతుందట

Entertainment

తొలిసారిగా రాశీఖన్నా తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకుందట. అవును. ఈ విషయాన్ని స్వయంగా రాశీఖన్నానే తెలియజేసింది. తొలిసారి తాను వరల్డ్ ఫేమస్ లవర్‌` సినిమా కోసం డబ్బింగ్ చెప్పుకున్నానని, ప్రేక్షకుల ఎలా రిసీవ్ చేసుకుంటారోనని ఎగ్జైటడ్‌గా ఉన్నానని రాశీ తెలియజేసింది.

విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరల్డ్ ఫేమస్ లవర్‌ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో విజయ్ సరసన రాశీఖన్నా నటిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

మళ్లీ మళ్లీ రానిరోజు సినిమా దర్శకుడు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో సీనియర్ ప్రొడ్యూసర్ కె.ఎస్‌.రామారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. డియర్ కామ్రేడ్ తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న చిత్రమిది. మరి. ఇప్పటి వరకు నటనతో ఆకట్టుకున్నరాశీ ఖన్నా తన మాటలతో ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *