దర్బార్ తెలుగు పోస్టర్ విడుదల

Entertainment

సూపర్ స్టార్ రజినీకాంత్, స్టార్ డైరెక్టర్ ఏఆర్‌మురుగదాస్‌ల ఫస్ట్ క్రేజి కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం `దర్బార్`. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.సుభాస్కరన్ అత్యంత భారీ బడ్జెట్‌తో, హైటెక్నికల్ వాల్యూస్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రజిని ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న సినిమాను అన్ని రకాల కమర్షియల్ హంగులతో మురుగదాస్ తెరకెక్కిస్తున్నారు. లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన రజిని పోస్టర్స్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాను 2020 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు. తాజాగా దర్బార్ మూవి తెలుగు మోషన్ పోస్టర్ ని సూపర్ స్టార్ మహేష్ ఈరోజు సాయంత్రం గం.5 ని.30లకు విడుదల చేశారు. ఆదిత్య అరుణాచలం గా సూపర్ స్టార్ రజినీకాంత్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించిన ఈ మోషన్ పోస్టర్ అనిరుధ్ పవర్ ప్యాకెడ్ మ్యూజిక్ తో సినిమా మీద అంచనాలను మరింత పెంచింది. దర్బార్ మోషన్ పోస్టర్ ని తెలుగు లో సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేయగా, తమిళ్ లో యూనివర్సల్ హీరో కమల్ హాసన్, హిందీ లో సల్మాన్ ఖాన్, మలయాళం లో మోహన్ లాల్ విడుదల చేశారు.

రజినీకాంత్ సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నివేత థామస్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తుంది, సునీల్ శెట్టి, తంబీ రామయ్య, యోగి బాబు, ప్రతీక్ బబ్బర్, నవాబ్ షా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి: సంతోష్ శివన్‌, మ్యూజిక్: అనిరుద్ రవి చంద్రన్, ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్, నిర్మాత: ఎ.సుభాస్కరన్, దర్శకత్వం: ఎ.ఆర్. మురుగదాస్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *