ఐపీఎల్‌పై బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఇక..!

Sports

ఐపీఎల్‌పై బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకోనుంది. ఇకపై ఐపీఎల్‌ ప్రారంభ వేడుకలను రద్దు చేయాలని బీసీసీఐ తీర్మానించినట్టు సమాచారం. ప్రతీ ఏటా ఐపీఎల్ ప్రారంభ వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ వచ్చారు. అసలు బీసీసీఐకి టీమిండియా ఆడే మ్యాచ్‌ల కంటే.. ఐపీఎల్ ద్వారానే వచ్చే ఆదాయమే అత్యధికంగా ఉంటుందని క్రికెట్ వర్గాల్లో ఓ అభిప్రాయం ఉంది. ఇలా కాసుల వర్షం కురిపించే ఐపీఎల్‌కు.. ప్రతీ ఏడాది ప్రారంభ వేడుకలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే.. ఇప్పుడు అనూహ్యంగా.. ఆరంభ వేడుకలను.. బీసీసీఐ రద్దు చేయాలనుకుంటుందట.

ప్రారంభ వేడుకలకు డబ్బు అనవసరంగా ఖర్చు అవుతోందని.. అందులోనూ.. అభిమానులు కూడా వీటిపై ఆసక్తి చూపకపోవడంతోనే.. వీటిని రద్దు చేయాలనుకుంటుందట.. బీసీసీఐ. అలాగే.. ఈ వేడుకల్లో పాల్గొన్న నటీనటులకు, కళాకారులకు పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించాల్సి వస్తోందని.. అందులో ఐపీఎల్-2020 సీజన్ నుంచి ప్రారంభ వేడుకలు లేకుండా.. టోర్నీలు కొనసాగించాలని బీసీసీఐ భావిస్తోందని.. ఓ అధికారి తెలిపారు. అలాగే.. మరోకారణమేమంటే.. పూల్వామా ఉగ్రదాడిలో పలువురు జవాన్లు అమరులు అయ్యారు. ఈ నేపథ్యంలో అప్పటి సీఓఏ వేడకలను రద్దు చేసి.. ఆ మొత్తం ఖర్చులో సగం భారత సైన్యానికి విరాళం ఇచ్చింది బీసీసీఐ. ఇప్పుడు కూడా అలానే చేయాలని బీసీసీఐ నిర్ణయించుకున్నట్టు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *