తెలంగాణకు ఎపి ప్రత్యేక బస్సులు

News

తెలంగాణలో ఆర్‌టిసి సమ్మె నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల నుంచి తెలంగాణకు ప్రత్యేక బస్సులను ఎపిఎస్‌ ఆర్‌టిసి నడుపుతోంది. తెలంగాణకు మరిన్ని బస్సు సర్వీసులు నడపాలని అక్కడి ప్రభుత్వం ఎపిఎస్‌ ఆర్‌టిసి అధికారులను కోరింది. ఎపి నుంచి తెలంగాణకు 549 రెగ్యులర్‌ సర్వీసులు ప్రతిరోజూ నడుస్తున్నాయి. అత్యధికంగా కృష్ణా రీజియన్‌ నుంచి తెలంగాణకు 150 బస్సు సర్వీసులు నడుస్తున్నాయి.
రీజియన్ల వారీగా ఎన్‌ఇసి నుంచి 1, విశాఖపట్నం నుంచి 11, తూర్పుగోదావరి నుంచి 51, పశ్చిమ గోదావరి నుంచి 34, గుంటూరు నుంచి 70, ప్రకాశం నుంచి 66, నెల్లూరు నుంచి 15, చిత్తూరు నుంచి 26, అనంతపురం నుంచి 24, కడప నుంచి 25, కర్నూలు నుంచి 76 బస్సు సర్వీసులు రెగ్యులర్‌గా నడుస్తున్నాయి. సమ్మె ప్రారంభమైన ఈ నెల 4న 410, 5న 300, 6న 160, 8న 354, 9న 333 ఎపిఎస్‌ ఆర్‌టిసి సర్వీసులు నడిచాయి. ”బస్సు సమయాలను, రద్దీని పర్యవేక్షించేందుకు హైదరాబాద్‌లోని పలు పికప్‌ పాయింట్లలో ఎపిఎస్‌ ఆర్‌టిసి నుంచి 15 మంది అధికారులను, 20 మంది సిబ్బందిని ఏర్పాటు చేశాం. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అవసరమైన ప్రత్యేక బస్సుల సంఖ్యను మధ్యాహ్నానికే అంచనా వేసి హైదరాబాద్‌ నుంచి బస్సులు నడుపుతున్నాం. ఆన్‌లైన్‌ పాసింజర్‌ రిజర్వేషన్‌ సిస్టంలో బస్సుల్లో సీట్లు నిండుతున్న తీరును పరిశీలిస్తున్నాం. రద్దీని బట్టి తెలంగాణకు ప్రత్యేక బస్సు సర్వీసులను కొనసాగిస్తాం.” అని ఒక ఆర్‌టిసి అధికారి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *