నవంబర్ 8న’అర్జున్ సురవరం’ !

Entertainment

యంగ్ హీరో నిఖిల్ కి బాగానే హిట్లు వచ్చాయి. నిజానికి నిఖిల్ కి వచ్చిన సక్సెస్ స్థాయికి.. నిఖిల్ వరుస సినిమాల రిలీజ్ లతో బిజీ బిజీగా ఉండాలి. కానీ ఒక్క హిట్ కూడా లేని హీరో సినిమాల లాగా నిఖిల్ సినిమాలు తయారవుతున్నాయి. టాలీవుడ్ లో ఇప్పుడంతా యంగ్ హీరోలదే హవా. కానీ ఆ హవాలో హడావుడి చెయ్యాల్సిన నిఖిల్.. అసలు ఏ మాత్రం తన ఉనికిని చాటుకోలేకపోతున్నాడు. ప్రస్తుత విషయంలోకి వెళ్తే.. నిఖిల్ నటించిన కొత్త చిత్రం ‘అర్జున్ సురవరం’. నూతన దర్శకుడు టి.ఎన్ సంతోష్ దర్శకత్వంలో యువ హీరో నిఖిల్ హీరోగా లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా ఎప్పుడో విడుదల కావాల్సిన చిత్రం ఎట్టకేలకూ విడుదలకు సిద్ధం అయింది. సినిమాకు కొత్త రిలీజ్ డేట్ దొరికింది. నవంబర్ 8వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాను బి.మధు సమర్పణలో మూవీ డైనమిక్స్ ఎల్ఎల్‌పీ, ఔరా సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ల పై రాజ్ కుమార్ ఆకెళ్ల, కావ్య వేణుగోపాల్ నిర్మించారు.

ప్రస్తుతం నిఖిల్ చందు మొండేటి దర్శకత్వంలో ‘కార్తికేయ – 2 ‘ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక సినిమా రెగ్యులర్ షూటింగ్ ను నవంబర్ రెండో వారం నుండి మొదలెట్టనున్నారు. కాగా చిత్రబృందం ఈ సినిమా హీరోయిన్ గా ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’తో హిట్ అందుకున్న శృతి శర్మను తీసుకున్నట్లు ఇటివలే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం నిఖిల్ సరసన హీరోయిన్ గా శృతి శర్మను ఫైనల్ చేయలేదట. ఈ వార్తలు రూమర్స్ అని తెలుస్తోంది. చిత్రబృందం ఇంకా హీరోయిన్ని వెతికే పనిలో ఉందట. ఇప్పటికే పుర్తయిన ఈ సినిమా స్క్రిప్ట్ లో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అలాగే ఓ కొత్త కాస్పెక్ట్ హైలెట్ అవునున్నాయట.

ఎలాగు ‘కార్తికేయ’ సినిమాతోనే డైరెక్టర్ గా మంచి డిమాండ్ తెచ్చుకున్న చందు.. మళ్ళీ నిఖిల్ తో ‘కార్తికేయ 2’ తీసి… తిరిగి మళ్ళీ ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి. ఈ చిత్రాన్ని ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *