రోడ్డుపై వ్యర్థాలు.. భారీ జరిమానా విధించిన జీహెచ్‌ఎంసీ

News

హైదరాబాద్: నిబంధనలు అతిక్రమిస్తున్న వారిపై జీహెచ్‌ఎంసీ కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇవాళ జరిగిన ఓ ఘటనే ఇందుకు ఉదాహరణ. వివరాల్లోకెళ్తే.. హైదరాబాద్‌లోని మియాపూర్ ప్రధాన రోడ్డుపై ఇద్దరు వ్యక్తులు భవన నిర్మాణ వ్యర్థాలు వేశారు. ఇలా భాద్యతా రాహిత్యంగా ప్రవర్తించి, రోడ్డుపై వ్యర్థాలు వేసి, ప్రయాణీకులకు తీవ్ర ఇబ్బందులు కలిగించిన వారిపై జీహెచ్‌ఎంసీ (గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్) కఠిన నిర్ణయం తీసుకున్నారు. వారిపై అధికారులు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున జరిమానా విధించారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకూడదని జీహెచ్‌ఎంసీ ప్రజలకు సూచించింది. నిబంధనలు అతిక్రమిస్తే ఇలాంటి చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *