అక్కడ వైసీపీ దెబ్బకు టీడీపీ ఇంకా కోమాలోనే…!

Politics

ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయి నాలుగు నెలలు దాటేసింది. అయితే ఘోర ఓటమి నుంచి కోలుకుని టీడీపీ అధినేత చంద్రబాబు అధికార వైసీపీపై పోరాటం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంపై విమర్శలు గుప్పిస్తున్నారు. అధినేతకు తోడు కొన్ని జిల్లాల నేతలు కూడా వైసీపీ ప్రభుత్వంపై విమర్శలని ఎక్కుపెడుతున్నారు. కానీ కొన్ని జిల్లాల నేతలు అయితే ఇంకా ఓటమి నుంచి కోలుకున్నట్లు లేరు. అధికారం పోయి నాలుగు నెలలు దాటిన అడ్రెస్ లేకుండా పోయారు.

అసలు ఆయా జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి కూడా ముందుకు రావడం లేదు. ముఖ్యంగా మొన్న ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవని కడప, కర్నూలు, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో టీడీపీ ఉందో లేదో కూడా తెలియడం లేదు. ఆయా జిల్లా నేతలు కంటికి కనిపించడం లేదు. ఇక్కడ చెప్పాల్సిన మరొక విషయం ఏమిటంటే 2014 ఎన్నికల్లో కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో టీడీపీ తక్కువ సీట్లే తెచ్చుకుంది. కడపలో ఒకటి, నెల్లూరు, కర్నూలులో మూడేసి సీట్లు తెచ్చుకుంది. ఇక మొన్న ఎన్నికల్లో అయితే జీరోకే పరిమితమైంది.

అయితే ఈ జిల్లాల్లో ఇద్దరు, ముగ్గురు నేతలే అప్పుడప్పుడు పార్టీ కార్యక్రమాల్లో కనిపిస్తున్నారు. నెల్లూరులో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కొంచెం యాక్టివ్ గా ఉన్నారు. అటు కర్నూలులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ నియోజకవర్గంలో అందుబాటులో ఉంటున్నారు. ఈ జిల్లాలతో పాటు చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో మాజీ మంత్రి అమరన్నాథ్ రెడ్డి మినహా ఎవరు పార్టీలో యాక్టివ్ గా లేరు. అటు చంద్రబాబు కూడా జిల్లాపై ప్రత్యేక శ్రద్ధ కూడా పెట్టడం లేదు. దీంతో చిత్తూరులో కూడా టీడీపీ పరిస్తితి దారుణంగా ఉంది. ఆ జిల్లాల్లో టీడీపీ పరిస్తితి కోమాలో ఉన్నట్టు… ఇలాగే కొనసాగితే టీడీపీ ఇప్పటిలో కోలుకునే అవకాశం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *