ఛారిటీ కోసం ఫుట్‌బాల్‌ ఆడిన ధోని

Sports

అర్జున్ కపూర్‌, లియాండర్‌ పేస్‌తో కలిసి..

ముంబయి: టీమిండియా వికెట్‌కీపర్‌ మహేంద్రసింగ్‌ ధోనీ సోమవారం బాలీవుడ్‌ నటుడు అర్జున్‌కపూర్‌, టెన్నిస్‌ దిగ్గజం లియాండర్‌ పేస్‌తో కలిసి ఓ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ ఆడాడు. రితి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఛారిటి మ్యాచ్‌ కోసం పలువురు క్రికెటర్లతో పాటు మరో బాలివుడ్‌ నటుడు సమిర్‌ కొచ్చార్‌, కొరియోగ్రాఫర్‌ కేసర్‌ గొన్‌సాల్వ్స్‌ పాల్గొన్నారు. రితి స్పోర్డ్స్‌ సంస్థ తమ ఫేస్‌బుక్‌లో ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఆటగాళ్లతో ధోనీ కలిసి ఉన్న ఫొటోలను అభిమానులతో పంచుకుంది.

అంతకుముందు ధోనీ ఆదివారం అర్జున్‌కపూర్‌తో కలిసి సరదాగా ఓ ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడాడు. అలాగే గతేడాది అక్టోబర్‌లో సైతం ముంబయిలో నిర్వహించిన ఓ ఛారిటీ సంస్థ కోసం ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ ఆడాడు. అప్పుడు ప్రియాంక చోప్రా భర్త నిక్‌ జోనాస్‌, బాలీవుడ్‌ నటుడు ఇషాన్‌ ఖట్టర్‌ ధోనీతో కలిసి ఆడారు. కాగా టీమిండియా క్రికెటర్‌కి ఫుట్‌బాల్‌ గేమ్‌ అంటే చాలా ఇష్టమనే విషయం తెలిసిందే. ఫుట్‌బాల్‌ ప్రీమియర్‌ లీగ్‌కు ధోనీ బ్రాండ్‌ అంబాసిడర్‌గా కొనసాగుతున్నాడు.

మరోవైపు వన్డే ప్రపంచకప్‌ తర్వాత టీమిండియాకు దూరమైన ధోనీ ఆర్మీలో కొద్ది రోజులు సేవలు అందించాడు. ఈ నేపథ్యంలో ధోనీ దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు వస్తాడని ఆశించినా అతడు మరిన్ని రోజులు క్రికెట్‌కు దూరంగా ఉండాలని భావిస్తున్నాడు. దీంతో రాబోయే బంగ్లాదేశ్‌ సిరీస్‌కు సైతం ఆడకపోవచ్చని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *