విజయనగరం పట్టణం కర్రలు మార్కెట్ లో అగ్నిప్రమాదం..

Crime

విజయనగరంః స్థానిక కర్రలు మార్కెట్ ఫ్లైవుడ్ దుకాణంలో అర్థరాత్రి 3.30 గంటల సమయంలో మంటలు చేలరేగాయి. ఇద్దరు యువకులు దుకాణం దగ్గర నిద్రిస్తూ ఉన్నారు. అందరూ నిద్రిస్తున్న సమయంలో ఘటన జరగడంతో ఎవరూ గమనించలేదు. అప్పటికే అంతా దుకాణం అంతా కాలిపోయింది. స్థానికులు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. మంటల్లో చిక్కుకున్న యువకులు స్పృహకోల్పోయారు. అగ్నిమాపక సిబ్బంది వారిని బయటికి తీసుకొని వచ్చారు. వెంటనే స్థానిక వైద్యశాలకు తరలించారు. మంటలను అదుపుచేస్తూనే ఉన్నారు. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *