దసరా వేడుకల్లో అపశ్రుతి

Crime

కడప : కడప పట్టణంలోని బీకేఏం వీధిలోని ఓ టీవీ షోరూం గోదాంలో జరిగిన అగ్నిప్రమాదంలో రూ.50లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. దసరా వేడుకల్లో భాగంగా మంగళవారం అర్ధరాత్రి నుంచి కొనసాగుతున్న అమ్మవారి ఊరేగింపులో బాణసంచా కాల్చడంతో నిప్పురవ్వలు ఎగిసి గోదాం సమీపంలోని పాత అట్టపెట్టలపై పడ్డాయి. ఈ విషయాన్ని ఎవరూ గమనించకపోవడంతో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాదంలో గోదాంలోని టీవీలు, ఫ్రిజ్‌లు, ఏసీలకు మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అప్పటికే గోదాంలోని వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. ఘటనా స్థలాన్ని డీఎస్సీ సూర్యనారాయణ పరిశీలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *