పోలీసులను కారుతో ఢీకొట్టే ప్రయత్నం..

Crime

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవరామ్‌పై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తన విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా, కారుతో తనను ఢీకొట్టే ప్రయత్నం చేశారంటూ ఆళ్లగడ్డ ఎస్ఐ.. భార్గవరామ్ మీద గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆళ్లగడ్డ లోని క్రస్సర్ విషయంలో శివరామి రెడ్డి బృందానికి, భార్గవ లకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ నెల ఒకటిన భార్గవ్ పై ఆళ్లగడ్డ పీఎస్ లో ఐపీసీ సెక్షన్ 143, 427, 447, 307, 507 ల కింద కేస్ నమోదయింది. ఆ కేసుకు సంబంధించి భార్గవ్‌ను అరెస్ట్ చేసేందుకు ఆళ్లగడ్డ ఎస్ఐ రవికుమార్ హైదరాబాద్‌లోని గచ్చిబౌలి వచ్చారు. పోలీసులను గుర్తించిన భార్గవరామ్ కారు ఆపకుండా వేగంగా పోనిచ్చారు. దీంతో పోలీసులు ఆయన కారును ఫాలో అయ్యారు. గచ్చిబౌలి లోని ఓక్ వుడ్ హోటల్ వద్ద భార్గవ కారును పోలీసులు ఆపే ప్రయత్నం చేశారు. కార్ ఆపినట్లే ఆపి వేగంగా ఎస్ ఐ పైకి దూసుకెళ్లారు భార్గవ రామ్. తమ విధులను ఆటంకపరచడం తో పాటు, కార్ తో గుద్దే ప్రయత్నం చేసాడని భార్గవ పై ఆళ్లగడ్డ ఎస్ఐ రవికుమార్ గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆళ్లగడ్డ నియోజకవర్గంలో గొడవలు జరిగాయి. టీడీపీ తరఫున భూమా అఖిలప్రియ పోటీ చేశారు. వైసీపీ తరఫున గంగుల విజేంద్ర రెడ్డి పోటీ చేశారు. ఎన్నికల ప్రచారం, పోలింగ్ సమయంలో పెద్ద గొడవలు జరిగాయి. రెండు పార్టీల కార్యకర్తలు పరస్పరం కొట్టుకునే వరకు వెళ్లారు. పరస్పరం పోలీసు కేసులు కూడా పెట్టుకున్నారు. అయితే, ఆ ఎన్నికల్లో భూమా అఖిలప్రియ ఓడిపోయారు. వైసీపీ అభ్యర్థి గంగుల గెలిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *