15 నుంచి ‘రైతు భరోసా’

News

అమరావతి: ఈ ఏడాది రబీ నుంచే ‘రైతు భరోసా’ కార్యక్రమాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు ఏటా రూ.12,500 ఇచ్చే ఈ పథకాన్ని అక్టోబరు 15 నుంచి పెద్ద ఎత్తున ప్రారంభించనున్నారు. గత టీడీపీ ప్రభుత్వం చేపట్టిన ‘అన్నదాతా-సుఖీభవ’ పథకాన్ని ఇటీవల సీఎం రద్దు చేశారు. వైసీపీ మేనిఫెస్టో ప్రకారం వచ్చే ఏడాది ఖరీఫ్‌ నుంచి ‘రైతు భరోసా’ అమలు చేయాల్సి ఉంది. అయితే ఈ ఏడాది అక్టోబరులో రబీ సీజన్‌ నుంచే అమలు చేస్తామని సీఎం తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *