ఐసీసీ టెస్ట్ ప్లేయర్ ర్యాంకింగ్స్‌లో 17వ స్థానానికి రోహిత్ శర్మ

Sports

దుబాయ్ : ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో అద్భుత ప్రతిభాపాటవాలు కనబరచిన భారత బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ సోమవారం ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో 17వ స్థానానికి ఎగబాకాడు. ఇది అతినికి కెరీర్‌బెస్ట్ ర్యాంకు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం వేదికగా జరిగిన భారత-దక్షిణాఫ్రికా మూడు టెస్ట్‌ల సిరీస్ తొలి మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 176 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 127 పరుగులు సాధించిన రోహిత్ శర్మ సత్తాచాటాడు. దీంతో ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అతను 36 పాయింట్లు మెరగుపరుచుకున్నాడు. ఐదు రోజుల సుదీర్ఘ ఫార్మాట్ కలిగిన టెస్టు మ్యాచ్‌లో తొలిసారిగా రోహిత్ శర్మ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌గా రంగంలోకి రెండు ఇన్నింగ్స్‌లోనూ సెంచరీలు చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో భారత్ దక్షిణాఫ్రికా జట్టుపై 203 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మూడు టెస్ట్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యతను భారత్ నిలుపుకుంది. కాగా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మరో భారత బ్యాట్స్‌మన్ సైతం గణనీయమైన ర్యాకింగ్‌ను అందుకున్నాడు. అతనే మయాంక్ అగర్వాల్. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ బాదిన మయాంక్ సైతం తన కెరీర్ బెస్ట్ 25వ ర్యాంకును అందుకున్నాడు. కాగా ఈ ప్రంపచ ర్యాంకింగ్స్‌లో భారత జట్టు సారధి విరాట్ కోహ్లి ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియాకు చెందిన నంబర్‌వన్ ర్యాంకర్ స్టీవ్ స్మిత్ కంటే కోహ్లి 38 పాయింట్లు దగువన ఉన్నాడు. ఇక బౌలింగ్ విభాగంలో భారత దిగ్గజ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ మళ్లీ ర్యాంకింగ్‌లో టాప్‌టెన్‌లోకి చేరుకున్నాడు. ప్రస్తుత జాబితాలో అశ్విన్ పదో ర్యాంక్‌కు ఎగబాకాడు. విశాఖ టెస్ట్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు సాధించిన అశ్విన్ మ్యాచ్ మొతంమీద 8 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. అలాగే ఐసీఐసీఐ ఆల్‌రౌండర్స్ ర్యాంకింగ్స్‌లోనూ అశ్విన్ ఐదో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ జాబితాలో రవీంద్ర జడేజా బంగ్లాదేశ్‌కు చెందిన షకీబ్ అల్ హసన్‌ను అధిగమించి రెండో స్థానానికి చేరాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *