అమరావతి: ఏపీలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను నిలిపివేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ఎన్నికల సంఘం అప్పీలు కోసం డివిజన్ బెంచ్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా విచారణ చేపట్టిన డివిజన్ బెంచ్.. విచారణను ఈనెల 18కి వాయిదా వేసింది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఈ నెల 8న షెడ్యూల్‌ను విడుదల చేసింది. అయితే ప్రజారోగ్యం దృష్ట్యా ఎన్నికలను నిర్వహించలేమని, ఈ ప్రక్రియను నిలిపివేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున ఏజీ, ఎస్ఈసీ తరఫున న్యాయవాది అశ్వనీకుమార్ రెండు గంటలపాటు వాదనలు వినిపించారు.
