ప్రకాశం జిల్లాలో బర్డ్‌ఫ్లూ కలకలం.!

News

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా దర్శి మండలంలో వారంరోజులుగా కోళ్లు మృత్యువాతపడుతుండటం కలవరానికి గురిచేస్తున్నది. వందల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతుండటంతో బర్డ్‌ ఫ్లూగా స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతి చెందిన కోళ్ల శాంపిళ్లను పశుసంవర్థకశాఖ అధికారులు ఇప్పటికే పరీక్షల నిమిత్తం పంపారు. కోళ్ల మృతికి సాధారణ వైరస్సే కారణమని పశుసంవర్థక శాఖ అధికారులు చెబుతున్నారు. మృత్యువాతపడిన కోళ్లను ముందు జాగ్రత్తగా పూడ్చిపెడుతున్నారు. కానీ స్థానికులు మాత్రం కొళ్ల మృతికి బర్డ్‌ ప్లూనే కారణమని భయాందోళనలో ఉన్నారు. ఇప్పటికే ఏడురాష్ట్రాల్లో బర్డ్‌ ఫ్లూ కలకలం రేపడంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు హైఅలర్ట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *