ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగాల్సిన పంచాయితీ ఎన్నికలు ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసుకొని షెడ్యూల్ రిలీజ్ చేసి, ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తున్నట్టు ప్రకటించింది. దీంతో ఆంధ్రప్రదేశ్ లో అమలు చేస్తున్న అమ్మఒడి పధకంపై దీని ప్రభావం పడింది. అయితే, ఎన్నికల కమిషన్ ఆదేశాలను పక్కన పెట్టి అమ్మఒడి పధకాన్ని అమలు చేయడానికి సిద్ధం కావడంతో పాటుగా ఏపీ ప్రభుత్వం ఎన్నికల నిర్వహణను నిలిపివేయాలని కోరుతూ కోర్టుకు వెళ్లారు. కోర్టు ఎన్నికల నిర్వహణను నిలిపివేయాలని తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ తీసుకున్న నిర్ణయాల వెనుక చంద్రబాబు ఉన్నారని, నిమ్మగడ్డ ప్రతి అడుగు చంద్రబాబు డైరెక్షన్ లోనే జరుగుతుందని, నిమ్మగడ్డ రాజ్యాంగ బాధ్యత ఉన్న వ్యక్తిగా వ్యవహరించడం లేదని వైసీపీ నాయకులు సజ్జల రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు. రాజకీయానికి, మతానికి ఎలాంటి సంబంధం ఉండకూడదు అన్నది తమ పార్టీ లైన్ అని సజ్జల పేర్కొన్నారు.
