గోపీచంద్ మలినేని, రవితేజ కాంబో హ్యాట్రిక్ కొట్టిన విషయం తెలిసిందే. వీరి కాంబోలో వచ్చిన క్రాక్ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో వీరి హ్యాట్రిక్ కొట్టారు. ఈ సినిమాతో అందాల రాసి శ్రుతిహాసన్ రీఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా కరోనా తర్వాత విడుదల మొట్టమొదటి భారీ బడ్జెట్ సినిమాతోనే కాకుండా మొట్టమొదటి బ్లాక్ బస్టర్గా కూడా పేరు తెచ్చుకుంది. ఈ ఏడాదిని మాస్ మహరాజ్ రవితేజ గొప్ప విజయంతో ప్రారంభించాడు. అయితే ప్రస్తుతం ఈ సినిమా దర్శకుడు గోపీచంద్ మలినేనికి పరిశ్రమలో డిమాండ్ భారీగా పెరిగింది. ఇప్పటి వరకు సరైన హిట్ లేని గోపీచంద్ ఈ సినిమాతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. టాలీవుడ్ అగ్రహీరోల సైతం అతడి దర్శకత్వంలో సినిమా చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. గోపీచంద్ కథతో సిద్దమైతే తమ డేట్స్ ఇచ్చేందుకు హీరోలు క్యూ కడుతున్నారని వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా హీరో గోపీచంద్ కూడా గోపీచంద్ మలినేనితో సినిమా చేయనున్నాడట. ఈ వార్తలపై మలినేని క్లారిటీ ఇవ్వాలి. అంతేకాకుండా తన తదుపరి చిత్రం కోసం కూడా అభిమానులు ఎదురుచూస్తున్నారు. త్వరలో తన నూతన చిత్రాన్ని ప్రకటిస్తాడని ఆశిస్తున్నారు.
