పవన్ కల్యాణ్ మూవీకి సాయిపల్లవి గ్రీన్‌సిగ్నల్‌..!

Entertainment

పవన్ కల్యాణ్-రానా కాంబినేషన్ లో అయ్యప్పనుమ్ కొషియుమ్ రీమేక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్టు ఇటీవలే పూజా కార్యక్రమాలతో ఘనంగా లాంఛ్ అయింది. ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ షురూ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో సాయిపల్లవిని వన్ ఆఫ్ ది ఫీమేల్ లీడ్ పొజిషన్ లో తీసుకునేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తుండగా..సాయిపల్లవి నో చెప్పినట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి.

అయితే తాజాగా ఇదే న్యూస్ మరోసారి లైమ్‌లైట్ లోకి వచ్చింది. సాయిపల్లవికి ఈ చిత్రానికి పచ్చ జెండా ఊపిందని ఫిలింనగర్ లో అప్ డేట్ ఒకటి చక్కర్లు కొడుతోంది. రీమేక్ లో ఒరిజినల్ వెర్షన్ కంటే మరింత పవర్ ఫుల్ గా పాత్రను డిజైన్ చేయడంతో సాయిపల్లవి ఓకే చేసినట్టు తెలుస్తోంది. సాయిపల్లవి ఈ ప్రాజెక్టులో జాయిన్ అవుతుందన్న న్యూస్ పై అధికారిక ప్రకటన రావడం ఒక్కటే పెండింగ్ లో ఉన్నట్టు సమాచారం. మరి ముందుగా వచ్చిన వార్తల ప్రకారం ఆన్ స్క్రీన్ పై పవన్ కల్యాణ్ భార్యగా నటిస్తుందా..? లేదా..? అనేది తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *