పశ్చిమగోదావరి: పోలీసుల తీరుపై ఎంపీ రఘురామకృష్ణంరాజు ధ్వజమెత్తారు. కోడిపందాల సాకుతో అమాయకులను అరెస్టు చేస్తున్నారన్నారు. కత్తులు కట్టి పందాలు నిర్వహిస్తే, నేరం అని కోర్టు చెప్పింది. కోళ్లను పెంచితే కాదన్నారు. కోర్టు ఆదేశాల సాకుతో పోలీసులు ఒవర్ యాక్షన్ చేస్తున్నారని మండిపడ్డారు. జీవనోపాధి కోసం కొందరు కోళ్లు పెంచుతుంటే, వాటిని తీసుకుపోతున్నారని చెప్పారు. కోళ్లు తీసుకు వెళ్లే వారు దొంగలతో సమానం.. దొంగలకు ఏ విధంగా బుద్ధి చెబుతారో వారికి అలాగే చేయండని సూచించారు. విగ్రహాలు ధ్వంసం చేసిన వారిపై ఏ ప్రతాపమూ చూపరూ.. కోళ్లను పెంచే వారిపై మీ ప్రతాపం చూపిస్తారా..? అని ఆయన ప్రశ్నించారు.
