హైదరాబాద్: కలెక్టర్లతో సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. తొలిదశలో ప్రభుత్వ, ప్రవేట్ రంగాల్లో పనిచేస్తున్న హెల్త్ కేర్ వర్కర్లకు వాక్సినేషన్ ఇవ్వాలన్నారు. వాక్సినేషన్ ప్రారంభించే కేంద్రాలలో గైడ్‌లైన్స్ ప్రకారం వసతులు కల్పించాలని సూచించారు. ఎక్కడైనా ప్రతికూల ప్రభావం కనపడితే వెంటనే తగు చర్యలు చేపట్టాలన్నారు. వాక్సినేషన్ చేసే కేంద్రాల్లో స్పెషల్ ఆఫీసర్‌ను నియమించాలని పేర్కొన్నారు.
