కూతురు పరీక్ష కోసం వెళ్లి తిరిగిరాని లోకాలకు

Crime

నాగర్‌కర్నూల్‌ : హైదరాబాద్ – శ్రీశైలం ప్రధాన రహదారిపై వంగూరు మండలంలోని కొండారెడ్డి పల్లి గేటు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హుస్సేన్(42) అనే వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు..జిల్లాలోని ఉప్పునుంతల మండలం రాయిచేడి గ్రామానికి చెందిన హుస్సేన్ తన కూతురును కల్వకుర్తి గురుకుల పాఠశాలలో పరీక్ష రాయించి తిరుగు ప్రయాణమయ్యాడు. కాగా, తన ద్విచక్ర వాహనం ప్రమాదవశాత్తు కింద పడటంతో తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కూతురుకు స్వల్ప గాయాలయ్యాయి. ఆమెను 108 ద్వారా ప్రభుత్వ దవాఖానకు తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *