కేజీఎఫ్ వంటి హిట్ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సలార్ చిత్రం చేస్తున్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రశాంత్ నీల్ రానున్న రోజులు వరుసగా ప్రభాస్ తో సమావేశం కానున్నాడని ఫిలింనగర్ లో వార్త చక్కర్లు కొడుతోంది. ప్రభాస్ తో సలార్ రెగ్యులర్ షూటింగ్‌తోపాటు ఇతర అంశాలపై ప్రశాంత్ నీల్ డిస్కస్ చేయనున్నాడట. తాజా సమాచారం ప్రకారం ప్రశాంత్ నీల్ ఫిబ్రవరి మొదటి వారంలో సలార్ రెగ్యులర్ మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తున్నాడు.
ప్రభాస్ డేట్స్ ఫైనలైజ్ అయిన వెంటనే..లొకేషన్ల ఎంపిక కూడా పూర్తి కానుంది. ఆ వెంటనే హీరోయిన్ ఎవరనేది కూడా ప్రకటించనున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్టుగా వస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ దిశాపటానీని హీరోయిన్ గా తీసుకోవాలని భావిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. మరికొన్ని రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రభాస్ గతంలో ఎన్నడూ చూడని విధంగా సలార్ లో చూపించనున్నాడట ప్రశాంత్ నీల్.
ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న కేజీఎఫ్ చాఫ్టర్ 2 ట్రైలర్ ఇప్పటికే రికార్డు స్థాయిలో వ్యూస్ రాబట్టింది. సినిమా ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. యశ్, సంజయ్‌దత్, రవీనాటాండన్, రావు రమేశ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.