తండ్రైన విరాట్ కోహ్లీ

Sports

న్యూఢిల్లీ: భారత క్రికెట్ టీమ్ సారథి విరాట్ కోహ్లీ తండ్రయ్యాడు. విరాట్ భార్య అనుష్క శర్మ పండంటి పాపకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను కోహ్లీ స్వయంగా ట్వీట్ చేస్తూ అభిమానులతో ఆనందాన్ని పంచుకున్నాడు. ”మీ ప్రేమ, అభిమానం, ప్రార్థనలకు కృతజ్ఞతలు. అనుష్క, పాప ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. మా జీవితంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఈసారి మా గోప్యతను మీరు గౌరవిస్తారని ఆశిస్తూ.. ప్రేమతో మీ విరాట్” అని ట్వీట్ చేశాడు. ఈ రోజు సాయంత్రం అనుష్క శర్మా పాపకు జన్మనిచ్చిందన్న విషయాన్ని విరాట్ ప్రకటించాడు. ఇదిలా ఉంటే విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ 2017లో వివాహం చేసుకున్నారు. ఇటీవల లాక్‌డౌన్ సమయంలో బేబీ బంప్‌తో తన ప్రెగ్నెన్సీ విషయాన్ని అనుష్క అభిమానులకు తెలిపింది. నేడు సాయంత్రం పాపకు జన్మనిచ్చింది. వీరి వివాహం 2017డిసెంబరులో అంగరంగ వైభవంగా జరిగింది. వీరు తమ రిసెప్షన్‌ను ముంబై, ఢిల్లీల్లో చేసుకున్నారు. అయితే అనుష్క తాను తల్లి కాబోతున్న విషయాన్ని గతేడాది ఆగస్టులో బేబీ బంప్‌తో ఉన్న ఫొటోతో తెలిపింది. అంతేకాకుండా తాము 2021 జనవరీలో తల్లిదండ్రి అవుతామని చెప్పారు. అయితే ఈ రోజు వారి కల నిజమైంది. గత తొమ్మది నెలలుగా వారు ఎదురు చూస్తున్న రోజు వచ్చేసింది. 2021 జనవరీ 11న వీరుష్కలు తల్లిదండ్రులయ్యారు. ప్రస్తుతం వీరి ఆనందానికి అవధులు లేవు. ఈ విషయం తెలిసిన అభిమానులు కూడా తమ ఆనందాన్ని తెలుపుతూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. అనుష్క, విరాట్ ఇద్దరూ ప్రేమించ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరు ఇద్దరూ కూడా వేరువేరు వృత్తులు వేరైనా ఒకరినొకరు ఇష్టపడి ఏడడుగులు నడిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *