హైదరాబాద్: జీహెచ్ఎంసి ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు గ్రేటర్ పరిధిలో ఉచిత మంచినీటి సరఫరా పథకం అమలుకు అధికారులు సన్నాహాలుచేస్తున్నారు. ఈమేరకుఈ పథకానికి సంబంధించి మంగళవారం నుంచి జూబ్లీహిల్స్ నియోజక వర్గం నుంచే మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి నగరానికి చెందిన మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్‌తో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు.
నియోజక వర్గంలోని రహ్మత్‌నగర్ డివిజన్ ఎస్పిఆర్ హిల్స్‌లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని మంత్రి తలసాని తెలిపారు. ఈసందర్భంగా వాటర్‌వర్క్స్ డీఓపీ కృష్ణ, సీజీఎం అనిల్, ఇతర అధికారలుతో కలిసి ఎస్పిఆర్ హిల్స్‌లో జరుగుతున్నఏర్పాట్లను వారు పరిశీలించారు. ప్రారంభ కార్యక్రమంలో గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొంటారని మంత్రి తలసాని తెలిపారు.