అమరావతి: ఏపీలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను హైకోర్టు రద్దు చేసింది. ప్రజారోగ్యం దృష్ట్యా ఎన్నికల షెడ్యూల్ రద్దు చేస్తున్నట్లు ఆదేశాలు వెలువరించింది. వ్యాక్సినేషన్‌కు ఆటంకం కలగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఎన్నికల షెడ్యూల్‌ను రద్దు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ హైకోర్టు విచారణ చేపట్టింది.ప్రభుత్వం తరఫున ఏజీ రెండు గంటలపాటు వాదనలు వినిపించారు. ఏకకాలంలో, ఎన్నికలు, కరోనా వ్యాక్సిన్ కష్టమవుతుందని కోర్టుకు వివరించారు. తాజా తీర్పు నేపథ్యంలో డివిజినల్ బెంచ్‌కు వెళ్లాలని ఎస్ఈసీ నిర్ణయించినట్లు సమాచారం.
