యువకుల వేధింపులు.. బస్సాపని డ్రైవర్! మరోదారిలేక ఆ బాలికలు..

Crime

లక్నో: బస్సులో ఆకతాయిల వేధింపులు తట్టుకోలేని ఇద్దరు బాలికలు బస్సాపండి అంటూ డ్రైవర్‌ను వేడుకున్నారు. వారి వేధింపులు భరించలేకున్నాము..దిగిపోతామంటూ కాళ్లావేళ్లాపడ్డారు. కానీ డ్రైవర్ మాత్రం ససేమిరా అన్నాడు. యువకుల వేధింపులు మాత్రం ఆగలేదు. దీంతో నిస్సహాయ స్థితిలో కూరుకుపోయిన ఆ ఇద్దరు బాలికలు మరోదారిలేక దారుణ నిర్ణయం తీసుకున్నారు. వేగంగా వెళుతున్న బస్సు నుంచి అమాంతం కిందకు దూకేశారు. దీంతో ఒకరి తలకి గాయాలవగా మరొకరి కాలి ఎముక విరిగిపోయింది. మనసును కలిచివేసే ఈ ఉదంతం గురువారం గ్రేటర్ నోయిడా ప్రాంతంలో జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *