రెబల్‌స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘రాధేశ్యామ్’. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రమిది. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. ప్రభాస్ అభిమానులు ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి హీరో ప్రభాస్, హీరోయిన్ పూజాహెగ్డే లుక్స్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. అయితే ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా సాలిడ్ అప్డేట్ గురించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం సంక్రాంతికి అభిమానులను ఆకట్టుకునేలా చిత్ర నిర్మాతలు ప్రీ టీజర్‌ను విడుదల చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం వెలువడనుంది. కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రమోద్, వంశీ, ప్రశీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పీరియాడికల్ మూవీగా తెరకెక్కుతోన్న ‘రాధేశ్యామ్’ను మార్చి 30న విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. హిందీలో ఈ చిత్రాన్ని టి సిరీస్ విడుదల చేస్తుంది.
