కోలీవుడ్ హీరో విజయ్, డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్లో తెరకెక్కి ఈ నెల 13వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రం ‘మాస్టర్’. ఈ చిత్రంలో మరో హీరో విజయ్ సేతుపతి విలన్‌గా నటించడం గమనార్హం. మాళవికా మోహన్, ఆండ్రియా, శాంతను భాగ్యరాజ్, అర్జున్ దాస్, గౌరి జి కిషన్, అళగమ్ పెరుమాళ్, శ్రీమాన్, పూవైయార్ ఇతర తారాగణం నటించగా, అనిరుథ్ సంగీత బాణీలు సమకూర్చారు. కాగా ఈ చిత్రం బిజినెస్‌పై ఇపుడు కోలీవుడ్‌లో రసవత్తరంగా చర్చ సాగుతోంది. వాస్తవానికి ఈ చిత్ర నిర్మాణం కోసం పెట్టిన ఖర్చు తక్కువ అయినప్పటికీ… హీరో, విలన్ పారితోషికమే అధికంగా ఉన్నట్టు వినికిడి. ప్రధానంగా ఈ చిత్రంలో హీరో విజయ్ రెమ్యునరేషన్ గత చిత్రం కంటే రూ.20 కోట్ల మేరకు అధికమని కోలీవుడ్ వర్గాల సమాచారం ఇక ప్రతినాయకుడిగా నటించిన విజయ్‌సేతుపతి కూడా రూ.10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. వీరితో పాటు ఇతర తారాగణం, నిర్మాణ వ్యయం కలిపి మొత్తం రూ.180 కోట్ల వరకు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది.
