హైదరాబాద్ : అసలే కరోనా వైరస్.. ఆపై సినిమాలు కూడా లేవు.. అందులోనూ చాలా రోజులుగా అభిమానులు మంచి మసాలా సినిమా కోసం వేచి చూస్తున్నారు.. అలాంటి సమయంలో క్రాక్ ముందుగా వస్తున్నట్లు అనౌన్స్ చేశారు. సంక్రాంతికి ఐదు రోజుల ముందు థియేటర్స్ లో సందడి చేస్తానని చెప్పాడు రవితేజ. దాంతో ఫ్యాన్స్ కూడా పండగ చేసుకుందాం అనుకున్నారు. అంతకుముందు మిరపకాయ్, కృష్ణ లాంటి సినిమాలతో పండక్కి వచ్చి విజయాలు అందుకున్నాడు మాస్ రాజా. అదే ఊపు ఇప్పుడు క్రాక్ కూడా చూపిస్తుందని నమ్మారు అభిమానులు. అయితే ఊహించినట్లు కాకుండా క్రాక్ విడుదల వాయిదా పడేసరికి అంతా షాక్ అయిపోయారు. అందులోనూ ఫినాన్షియల్ ఇష్యూస్ కారణంగా వాయిదా పడటమే వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ సమయంలో సినిమా వచ్చుంటే కచ్చితంగా కలెక్షన్స్ కుంభవృష్టి ఖాయం.
