కళ్యాణ్ రామ్ లిమిట్స్ దాటుతున్నాడా?

Entertainment

నందమూరి నటవారసుల్లో కళ్యాణ్ రామ్ కూడా ఒకడు. వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. కానీ అతడికి తన కెరీర్‌లో పెద్ద హిట్‌లు పడలేదు. కళ్యాణ్ రామ్ చేసిన పటాస్ సినిమా కెరీర్ హిట్‌గా నిలిచింది. దాని తరువాత మళ్లీ ఆ స్థాయి హిట్ అందుకోలేదు. దాంతో ఎలాగైన సరైన హిట్ అందుకోవాలని కళ్యాణ్ రామ్ ప్రయత్నిస్తున్నాడు. అందులో భాగంగా వరుస సినిమాలు చేస్తూ జోరు చూపుతున్నాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎన్నడూ లేనివిధంగా భారీ బడ్జెట్ సినిమాలు వరుసగా తెరకెక్కుతున్నాయి. హీరోలు భారీ ప్రాజెక్ట్‌లను లైన్‌లో పెడుతున్నారు. ఇక తనకు కూడా హిట్ రావాలంటే భారీ బడ్జెట్ సినిమా తప్పదనుకున్నాడేమో కానీ ఇప్పుడు కళ్యాణ్ రామ్ కూడా అదే పంథాలో వెళ్ళనున్నాడు. కొడితే బాక్సాఫీస్‌ని భారీ రేంజ్‌లోనే కొట్టాలనుకున్నట్లున్నాడు. అందుకేనేమో భారీ బడ్జెట్ సినిమాను లైన్‌లో పెడుతున్నాడట. ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. కళ్యాణ్ రామ్ తన మార్కెట్‌కు మించి ఖర్చు చేస్తూ తన లిమిట్స్ దాటుతున్నాడట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *