గుంటూరు: చంద్రబాబు కోర్టులకు వెళ్లి ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఈనెల 11న ఇవ్వాల్సిన అమ్మఒడి పథకాన్ని దుష్ట శక్తులు ఎన్నికల కోడ్ పేరుతో ఆపేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలు అవసరమే కానీ కరోనా వల్ల అపాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా అన్ని కార్యక్రమాలు సీఎం జగన్ చేస్తున్నారని చెప్పారు. మనలో మనం కొట్టుకునే విధంగా మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
