అబద్ధాలతో అధికారంలోకి రావాలని బీజేపి ఆరాటం- ఎర్రబెల్లి

Politics

వరంగల్‌: తెలంగాణలో అబద్ధాలతో అధికారంలోకి రావాలని బిజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని పంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. బిజేపీవి అబద్ధాల మాటలు, అసత్య ప్రచారాలనిఆరోపించారు. కేంద్ర నాయకులు పొగుడుతారు. కానీ రాష్ట్ర నాయకులు విమర్శిస్తారు. ఇదేం వైఖరి? ఇదేం రాజకీయం ? అంటూ ఆయన విస్మయం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు నయాపైసా ఇవ్వడలేదని మంత్రి పేర్కొన్నారు. నీతి ఆయోగ్‌ చెప్పినా, మిషన్‌ భగీరథకు నిధులు విదిల్చలేదని ఆరోపించారు. సంక్షేమ పధకాల విషయంలో దేశంలో తెలంగాణ మాత్రమే నెంబర్‌వన్‌గా నిలిచిందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *