ఢిల్లీ-బెంగళూరు రాజధాని రైలు ఇంజినులో స్వల్ప అగ్నిప్రమాదం

News

హైదరాబాద్ : ఢిల్లీ- బెంగళూరు రాజధాని రైలు ఇంజినులో ఆదివారం రాత్రి స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. ఢిల్లీ- బెంగళూరు రాజధాని రైలు వికారాబాద్ దాటాక నవాండి రైల్వేస్టేషను మీదుగా వెళుతుండగా రైలు ఇంజినులో మంటలు చెలరేగాయి. ఢిల్లీ- బెంగళూరు రాజధాని రైలు ఇంజినులో నుంచి పొగ రావడాన్ని లోకో పైలట్ గుర్తించి ముందుజాగ్రత్త చర్యగా రైలును నిలిపివేశారు. రైలు ఇంజినులో మంటలు చెలరేగడంతో రైలును ఆపి బోగీలను వేరు చేశారు. రైలు డ్రైవరు అప్రమత్తతతో పెద్ద రైలు ప్రమాదం తప్పింది. ఇంజిను నుంచి బోగీలను వేరు చేయడంతో రైలు ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెప్పారు. రైలు ఇంజినులో చెలరేగిన మంటలను అగ్నిమాపక సాధనంతో ఆర్పి వేశారు. రాజధాని రైలు ఇంజనులో అగ్నిప్రమాదం అనంతరం రిలీఫ్ లోకోమోటివ్ ను స్టేషనుకు పంపించినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెప్పారు. ఈ ప్రమాదం అనంతరం రైలును నిలిపివేశారు. రైలు ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం ఏర్పడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *