డాక్టర్స్ లీగ్ చాంప్ రిమ్స్

Sports
  • హైదరాబాద్‌: తెలంగాణ గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజెస్‌ డాక్టర్స్‌ టీ10 క్రికెట్‌ లీగ్‌లో ఆదిలాబాద్‌ రిమ్స్‌ టీమ్‌ చాంపియన్‌గా నిలిచింది. ఆదివారం ఎల్బీ స్టేడియంలో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో రిమ్స్‌ 8 వికెట్ల తేడాతో నిమ్స్‌ టీమ్‌పై గ్రాండ్‌ విక్టరీ సాధించింది. టాస్‌ నెగ్గి తొలుత బ్యాటింగ్‌ చేసిన నిమ్స్‌ నిర్ణీత 10 ఓవర్లలో ఐదు వికెట్లకు 81 రన్స్‌ చేసింది. కేతన్‌ (45) సత్తా చాటాడు. అనంతరం రిమ్స్‌ టీమ్‌ 9.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 82 రన్స్‌ చేసి గెలిచింది. చేతన్‌(42) టాప్‌ స్కోరర్‌. ఉస్మానియా%–%ఎ టీమ్‌ ప్లేయర్‌ డాక్టర్‌. భరత్‌ మ్యాన్‌ ఆఫ్‌ ద టోర్నమెంట్‌ గా నిలిచాడు. డాక్టర్‌ ఈశ్వర్‌ (రిమ్స్‌ ఆదిలాబాద్‌) బెస్ట్‌ బౌలర్‌, డాక్టర్‌. కేతన్‌ (నిమ్స్‌) బెస్ట్‌ బ్యాట్స్‌మన్‌ అవార్డులు గెలుచుకున్నారు. ఈ ముగ్గురికి ఎవెలెట్‌ ఎలక్ట్రిక్‌ మోటార్స్‌ చైర్మన్‌ డాక్టర్‌ విద్యాసాగర్‌ ఒక్కో ఎలక్ట్రిక్‌ స్కూటీ గిఫ్ట్‌గా అందించారు. విజేత రిమ్స్‌, రన్నరప్‌ నిమ్స్‌ జట్లకు రాష్ట్ర ఐటీ శాఖ సెక్రటరీ, ఐఏఎస్‌ జయేశ్‌ రంజన్‌ ట్రోఫీలు అందించారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్‌ సెక్రటరీ శ్రీనివాస్‌ రాజు, శాట్స్‌ చైర్మన్‌ ఎ. వెంకటేశ్వర్‌ రెడ్డి, ఒలింపిక్‌ అసోసియేషన్‌ సెక్రటరీ జగదీశ్వర్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *