ఫొటోటాక్: కిల్లింగ్ ఫోజ్ ఇచ్చిన మాస్టర్ బ్యూటీ

Entertainment

సౌత్ లో ప్రస్తుతం మాళవిక మోహన్ పేరు తెగ వినిపిస్తుంది. ఈ అమ్మడు చేస్తున్న సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్దకు వస్తున్నా కొద్ది ఈ అమ్మడి క్రేజ్ అంతకంతక పెరుగుతూనే ఉంది. తెలుగులో కూడా ఈమె అతి త్వరలోనే నటించేందుకు సిద్దం అవుతుంది. ఈ సంక్రాంతికి మాస్టర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో తన హాట్ ఫొటో షూట్ తో ఫాలోవర్స్ ను క్రమం తప్పకుండా ఆకట్టుకుంటూనే ఉంది. తాజాగా ఈ ఫొటోను షేర్ చేసిన మాళవిక మరోసారి వావ్ అనిపించింది. క్లీవేజ్ షో తో పాటు ఆకట్టుకునే ఔట్ పిట్ తో సింపుల్ లుక్ తో కిల్లింగ్ ఫోజ్ ఇచ్చిన ఈ అమ్మడి ఫొటో వైరల్ అవుతోంది. ఈ అమ్మడు ముందు ముందు సౌత్ లో మరిన్ని సినిమాల్లో స్టార్ హీరోలకు జోడీగా నటించే అవకాశం ఉందని ఈ ఫొటోలతో అనిపిస్తుంది. తెలుగులో ఈ అమ్మడు 2021లో ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. మాస్టర్ సినిమా తెలుగులో కూడా విడుదల కాబోతుంది. కనుక ఇక్కడ కూడా అమ్మడికి అభిమానులు పెరిగే అవకాశం ఉందంటున్నారు. కెరీర్ ఆరంభించి చాలా కాలం అయినా ఇప్పటికి ఈ అమ్మడికి గుర్తింపు లభించింది. ప్రస్తుతం తమిళంలో ఈ అమ్మడి జోరు మామూలుగా లేదు. ముందు ముందు స్టార్ హీరోలకు ఈమె మోస్ట్ వాంటెడ్ అవ్వడం ఖాయం అనిపిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *