‘అర్జున్ రెడ్డి’ హీరోయిన్ ప్రోబ్లమ్ ఏంటి?

Entertainment

టాలీవుడ్ స్క్రీన్ పై ‘అర్జున్ రెడ్డి’ ఓ సంచలనం. అప్పటివరకూ వస్తున్న లవ్ స్టోరీస్ కి ఈ సినిమా సింపుల్ గా కామా పెట్టేసి యూత్ దృష్టిని తనవైపుకు తిప్పుకుంది. ఆ తరువాత రానున్న లవ్ స్టోరీస్ కి ఒక ట్రెండ్ సెట్ చేసి పెట్టేసింది. ఈ సినిమాలో ‘ఆ పిల్ల నాది’ అనే డైలాగ్ ఇప్పటికీ యూత్ నోటి వెంట వినిపిస్తూనే ఉంటుంది .. ఆ పిల్లను కూడా యూత్ మరిచిపోలేదు. ఎందుకంటే ముద్దబంతిలా కనిపించే షాలినీ పాండేను మరిచిపోవడం వయసులో ఉన్న కుర్రాళ్లకు సాధ్యమయ్యే పనికాదు. బ్యాచ్ లర్స్ రూమ్స్ లోని గోడలపై ఆమె పోస్టర్స్ ను కూడా వాళ్లు మార్చుకోలేదు. నిజానికి షాలినీ పాండే మంచి అందగత్తె .. పొద్దుతిరుగుడు పువ్వువంటి గుండ్రని ముఖం .. కలువ రేకుల్లాంటి కళ్లు .. కారుమబ్బుల్లాంటి కనుబొమలు .. పండు మిరపకాయల్లాంటి పెదాలతో ఈ బ్యూటీ కుర్రాళ్ల గుండె గదులను ఖాళీ చేసేసింది. ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో ఈ పిల్ల చేసిన పాత్ర యూత్ కి బాగా కనెక్ట్ అయింది. దాంతో ఆమె క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఒక సంచలన విజయాన్ని సాధించిన తరువాత హీరోలతో పాటు హీరోయిన్స్ కి కూడా వరుసగా అవకాశాలు వచ్చిపడుతుంటాయి. కానీ షాలినీ పాండే విషయంలో అలా జరగలేదు. అందుకు కారణం ఆమెకి సరైన ప్లానింగ్ లేకపోవడం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *