1990 కాలంను గుర్తు చేస్తున్న చిరంజీవి

Entertainment
  • మెగా స్టార్ చిరంజీవితో పాటు టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు అంతా కూడా 1990 కాలం అంతకు ముందు ఏడాదిలో పదుల సంఖ్యలో సినిమాలు చేసిన సందర్బాలు ఉన్నాయి. 2000 సంవత్సరంకు ముందు వరకు కూడా ఒక్క ఏడాదిలో స్టార్ హీరోలు నాలుగు అయిదు అంతకు మించి కూడా చేశారు. ఈమద్య కాలంలో ఏడాదికి ఒకటి రెండు అన్నట్లుగా విడుదల చేస్తున్నారు. కొందరు హీరోలు ఏడాదిలో కనీసం ఒక్కటి కూడా విడుదల చేయలేక పోతున్నారు. రెండు మూడు సంవత్సరాలకు ఒకటి రెండు సినిమాలను విడుదల చేస్తున్నారు. ఇలాంటి సమయంలో సీనియర్ హీరోలు కూడా సినిమాల సంఖ్యను భారీగా తగ్గించారు. ఒకదాని తర్వాత ఒకటి అన్నట్లుగా ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. చిరంజీవి ఒకప్పుడు నెలకు ఒక సినిమా చొప్పున విడుదల చేసిన సందర్బాలు చాలా ఉన్నాయి. అలాంటి చిరంజీవి కూడా రీ ఎంట్రీ తర్వాత చాలా స్లోగా సినిమాలు చేస్తున్నారు. ఎట్టకేలకు ఆయన జోరు పెంచారు. తన పాత రోజులు గుర్తు చేసుకుని మరీ వరుసగా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్న చిరంజీవి మరో వైపు మూడు సినిమాలను లైన్ లో పెట్టాడు. ఆ మూడు సినిమాలను కూడా సమాంతరంగా చేస్తాడని వార్తలు వస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *