ఈ ఇస్మార్ట్ భామ ‘ఐరన్ లెగ్స్’ లిస్టులో చేరుతోందా..??

Entertainment

టాలీవుడ్ ఇండస్ట్రీలో నన్ను దోచుకుందువటే సినిమాతో అడుగు పెట్టింది కన్నడ బ్యూటీ నభా నటేష్. ఈ యంగ్ బ్యూటీ ఆకట్టుకునే అందంతో పాటు మంచి అభినయంతో ఫస్ట్ మూవీతోనే కుర్ర హృదయాలను గెలిచింది. ఆ సినిమాతోనే టాలీవుడ్ స్టార్ దర్శకులు హీరోల దృష్టిని ఆకర్షించింది. కన్నడ పరిశ్రమ నుండి తెలుగు పరిశ్రమలో కాలుపెట్టిన నభా.. ఈ భామ ఇప్పుడిప్పుడే వరుస సినిమాలతో బిజీగా మారే ప్రయత్నం చేస్తోంది. గతేడాది డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ రూపొందించిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో మంచి హిట్ అందుకుంది. కానీ ప్రస్తుతం ఇండస్ట్రీలో నభా పేరు ఐరన్ లెగ్ గా మారిపోతుందట. ఈ భామ కెరీర్ లో చెప్పుకోదగ్గ భారీ హిట్ ఏదైనా ఉందంటే అది కేవలం ఇస్మార్ట్ శంకర్ మాత్రమే. కానీ ఇస్మార్ట్ సక్సెస్ క్రెడిట్ అంతా హీరో రామ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తీసుకెళ్లిపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *