ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా చంపిన భార్య

Crime

హైదరాబాద్ : వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. ఈ ఘటన చాంద్రాయణగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ రుద్ర భాస్కర్‌, ఎస్‌ఐ గోవర్ధన్‌ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… చాంద్రాయణగుట్ట న్యూ ఇందిరానగర్‌కు చెందిన మహిళ ఐదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆమె కొన్నాళ్లుగా షేక్‌ బిలాల్‌ హుస్సేన్‌తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం భర్తకు తెలియడంతో మందలించాడు. అది మనసులో పెట్టుకున్న ఆమె తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయాలని నిర్ణయించుకుంది. ఈ నెల-18న ఇంట్లో నిద్రిస్తున్న భర్త ముఖంపై ప్రియుడు సహాయంతో దిండుతో అదిమిపెట్టి ఊపిరి ఆడకుండా చేసి ఆమె చంపేసింది. అనంతరం ఏమీ తెలియనట్లుగా అత్తమామల దగ్గరికి వెళ్లి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి మీ కుమారుడిని కొట్టడంతో చనిపోయాడని చెప్పి నమ్మించే ప్రయత్నం చేసింది. ఆమెపై అనుమానాలు ఉన్నాయని మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నేరం ఒప్పుకుంది. దీంతో ఆమెతో పాటు షేక్‌ బిలాల్‌ హుస్సేన్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *