సాగర్రోడ్డుపై ఐటీఐవిద్యార్ది ఆత్మహత్య

Crime

నవతెలంగాణ-వనస్థలిపురం: ఐటీఐ విద్యార్థి సాగర్‌రోడ్డు జాతీయ రహదారిపై చెట్టుకు ఉరివేసుకు న్నాడు. ఈ సంఘటన మంగళవారం వనస్ధ్థపురం పోలీస ్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం గుడితండాకు చెందిన రమావత్‌ లక్ష్మణ్‌నాయక్‌(26) ఐటీఐ పూర్తి చేశాడు. చదువుకు దగ్గ ఉద్యోగం దొరక్క మానసిక ఒత్తిడికి గురైయ్యాడు. మంగళవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఎంతకూ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టగా సాగర్‌రోడ్డు జాతీయ రహదారి పక్కన ఉన్న చెట్టుకు ఉరివేసుకుని కన్పించాడు. దీంతో మృతుని కుటుంబసభ్యులు వనస్థలిపురం పోలీసులకు సమాచారం ఇచ్చారు దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *