రెవెన్యూ వివాదాలకు విరామం

News

తిరువూరు మండలంలో ఓ రైతుకు 5 ఎకరాల భూమి ఉంది. రికార్డుల ప్రకారం సర్వే నెంబరు 10గా ఉంది. కానీ క్షేత్రస్థాయిలో ఆయన స్వాధీనంలో ఉన్న భూమి సర్వేనెంబరు 11. గత కొంతకాలంగా దీనిపై వివాదం చెలరేగుతోంది. నూజివీడు ప్రాంతానికి చెందిన పలు గ్రామాల్లో మెట్ట భూములను రైతులు దశాబ్దాల తరబడి సాగు చేస్తున్నారు. కానీ రికార్డు పరంగా వారికి ఏ ఆధారం లేదు. ఇలాంటి సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో రీసర్వేతో పాటు భూమి రికార్డుల స్వచ్ఛీకరణ (ప్యూరిఫికేషన్‌) కార్యక్రమాన్ని చేపట్టారు. ఇక నుంచి రికార్డుల స్వచ్ఛీకరణ తర్వాత పట్టాదారు పేరుతో పాటు తండ్రి పేరు, ఆధార్‌ నెంబరు ఇతర వివరాలను నమోదు చేస్తారు. వచ్చే ఏడాది నాటికి జిల్లాలో భూరికార్డుల స్వచ్ఛీకరణ పూర్తి కావాలని నిర్ణయించారు. మూడు దశల్లో ఈ కార్యక్రమం చేపట్టినట్లు జిల్లా సంయుక్త కలెక్టర్‌ కె.మాధవీలత ‘ఈనాడు’తో చెప్పారు. ప్రస్తుతం రికార్డుల కంప్యూటరీకరణ జరుగుతోంది. రెవెన్యూ దస్త్రాల స్వచ్ఛీకరణతో పలు వివాదాలకు తెరపడనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *