టాక్సీ డ్రైవర్లను ఆదుకోవాలి

Uncategorized

కరోనా లాక్‌డౌన్‌, తాజాగా భారీ వరదల వల్ల తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన టాక్సీ యజమానులు, డ్రైవర్లను ఆదుకోవాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4.5 లక్షల మంది డ్రైవర్లు టాక్సీల ద్వారా ఉపాధి పొందుతున్నట్లు మంగళవారం ప్రకటనలో తెలిపారు. యజమానులు చెల్లించాల్సిన పన్నులను ఆరు నెలలు రద్దు చేయడంతో పాటు సరిహద్దు టాక్స్‌ను సైతం మినహాయించే విధంగా వెసులుబాటు కల్పించాలని కోరారు. సొంత టాక్సీ ఉన్న డ్రైవర్ల తెల్లకార్డులను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *