మా వీసాలపై హామీ ఇవ్వండి: పాకిస్థాన్‌

Sports

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌లో జరగనున్న 2021 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు పాకిస్థాన్‌ ఆటగాళ్లతో పాటు సహాయ సిబ్బందికి వీసాలపై హామీ ఇవ్వాలని ఆ దేశ క్రికెట్ బోర్డు పేర్కొంది. భారత్‌, పాక్‌ మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తల కారణంగా ఇప్పటికే ఓ ద్వైపాక్షిక సిరీస్‌ రద్దయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది అక్టోబర్‌లో భారత్‌లో జరగనున్న ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు తమకు వీసాల మంజూరుపై హామీ ఇవ్వాలని పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు కార్యనిర్వాహణ అధికారి వసీం ఖాన్‌ ఐసీసీని కోరారు.

‘ఇరు దేశాల మధ్య ఉద్రికత్తల నడుమ ద్వైపాక్షిక సిరీస్‌ ఉంటుందని మేం ఆశించడం లేదు. అయితే.. ప్రపంచకప్‌ అనేది ఐసీసీకి సంబంధించిన విషయం. ఐసీసీ నిబంధనల ప్రకారం.. టోర్నీకి ఆతిథ్యమిచ్చే దేశం.. ప్రపంచకప్‌లో పాల్గొనే జట్లన్నింటికీ అన్ని రకాల వసతులు కల్పించాల్సి ఉంటుంది. పాకిస్థాన్‌ కూడా అందులో భాగమే. మా ఆటగాళ్లకు వీసాల అందేలా ఐసీసీ హామీ ఇస్తుందని భావిస్తున్నాం. ఈ విషయంలో ఐసీసీ కలగజేసుకొని భారత ప్రభుత్వంతో మాట్లాడాలని కోరాం. ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాం. భారత్‌-పాక్‌ మధ్య మ్యాచ్‌ను అభిమానులు చూడాలని కోరుకుంటున్నారు’ అని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *